ఈ యూనివర్శిటీలు అన్నీ బోగస్ ..జాగ్రత్త

updated: March 17, 2018 18:01 IST

ఈ రోజులలో బోగస్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి  విద్యార్థులను వలలో వేసుకుని మోసం చేస్తున్నాయి. బోగస్ విద్యాసంస్థలలో చదువుతోన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. యూనివర్శిటీ గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా ఇప్పటికే 23 బోగస్ యూనివర్శిటీలున్నాయని ప్రకటించింది. ఈ యూనివర్శిటీలకు ఎలాంటి అనుమతులు లేవని అయినప్పటికీ మేనేజి మెంట్లు వాటిని నడుపుతున్నాయని యూజీసీ పేర్కొ న్నది. 

ఆ యూనివర్శిటీ చదువులకు గుర్తింపు లేదని ప్రకటించింది. ఇలాంటి యూనివర్శిటీ డిగ్రీలకు గుర్తింపులు లేవని, రిక్రూట్మెంట్లకు ఈ డిగ్రీలు దోహదపడవని, పదోన్నతులకు కూడా ఉపయోగ పడవని స్పష్టం చేసింది. బోగస్ యూనివర్శిటీలు ఎక్కువగా ఉత్తరాదిన ఉన్నాయి. దక్షిణాదిన కూడా ఈ రకం యూనివర్శిటీలు పుట్టుకొస్తున్నాయి. 

 

నియమ నిబంధనలకు లోబడి కార్యకలా పాలు సాగించని 22 భారత యూనివర్శిటీలను తప్పుడు వర్శిటీలుగా ప్రకటిస్తూ, యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్) ఓ ప్రకటన వెలువరించింది. ఈ వర్శిటీల్లో విద్యా ర్థులు చేరవద్దని, ఇవన్నీ స్వయం ప్రకటితాలని, వీటి డిగ్రీ లకు గుర్తింపు ఉండదని తెలిపింది. యూజీసీ వెల్లడించిన ఫేక్ వర్శిటీలివి. వాటి లిస్ట్ మీకు ఇక్కడ ఇస్తున్నాం. 

  

దేశంలోని వివిధ రాష్ట్రాలలోని బోగస్ యూనివర్శిటీలు

1. మెథిలి యూనివర్శిటీ / విశ్వవిద్యాలయం, దర్భంగా, బీహార్. 

2. వారణాసీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వార ణాసి, యు.పి / జగత్ పురి, ఢిల్లీ.

 3. కమర్షియల్ విశ్వవి ద్యాలయం లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ.

 4. యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, ఢిల్లీ.

 5. ఒకేషనల్ యూనివర్శిటీ, ఢిల్లీ.

 6. ఏడీఆర్ – సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్శిటీ, ఏడీఆర్ హౌస్, 8జే, గోపాల టవర్, 25 రాజేంద ప్లేస్, న్యూఢిల్లీ – 110 008

. 7. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ. 

8. బదగన్వీ సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసెటి, గోకక్, బెల్గాం (కర్నాటక), 

9. సెయింట్ జాన్స్ యూనివర్శిటీ, కిష నాట్టం, కేరళ,

10. రాజా అరబిక్ యూనివర్శిటీ, నాగపూర్, 

11. డీడీబీ సంస్కృత విశ్వవిద్యాలయం, పు త్తూర్, త్రిచి, తమిళనాడు.,

 12. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, 80, చౌరంగీ రోడ్, కోల్ కతా – 20., 

13. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్, 8-ఎ, డెమండ్ హార్బర్ రోడ్, ఠాకూర్ పూర్, కోల్ కతా.

14. మహిళా గ్రామ విద్యాపీట్ / విశ్వవిద్యాలయ, (మహిళా విశ్వవిద్యాలయం) ప్రయాగ, అలహాబాద్ (ఉత్తరప్రదేశ్).

15. గాంధీ హిందీ విద్యాపీట్ ప్రయాగ, అలహాబాద్ (ఉత్తరప్రదేశ్).

16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎల్రక్టో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్.

17. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యూనివర్శిటీ (ఓపెన్ యూనివర్శిటీ), అలిగఢ్ (ఉత్తరప్రదేశ్) 

18. ఉత్తర్రపదేశ్ విశ్వవిద్యాలయ, కొసికలాన్, మధుర (ఉత్తరప్రదేశ్).

19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్ గఢ్ (ఉత్తరప్రదేశ్).

20. ఇంద్రప్రస్థా శిక్షా పరిషత్, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, ఖోడా, మకన్ పూర్, నోయిడా ఫేజ్-2, (ఉత్తరప్రదేశ్)

 21. గురుకుల్ విశ్వవిద్యాలయ బృందావన్, మధుర, (ఉత్తరప్రదేశ్). 

22. నబా భరత్ శిక్షా పరిషత్, అన్నపూర్ణ భవన్, ప్లాట్ నం 242, పానీ టాంకీ రోడ్, రూర్కెలా.

(పీఐబీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్, ఎన్‌సీబీఆర్ నివేదిక సమాచారం ఆధారంగా)

comments