ఇన్ఫోసిస్ తాజా ఉద్యోగ ప్రకటన..

updated: June 2, 2018 11:28 IST

ఐటీ ఉద్యోగులకు శుభవార్త. దేశీయ ఐటీ రంగంలో అగ్రభాగాన ఉన్న ఇన్పోసిస్‌ లో పనిచేయాలని ప్రతి టెక్నాలజీ విద్యార్థి కోరుకుంటుంటారు.  తాజాగా ఈ సంస్ద ఉద్యోగాల కోసం ప్రకటన చేసింది.  ఈ కంపెనీ 2018 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ ని తీసుకోనుంది. 

ఇక ఇన్ఫోసిస్ లో జాబ్ కావాలని కోరుకునే ఉద్యోగులకు  ఓ రెండు క్వాలిటీలను తప్పనిసరిగా కలిగి ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చెప్పారు.

 నారాయణ మూర్తిగారి మాటల్లోనే... '' ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కావాలనుకునే వారికి తెలివి, విలువలు ఉండాలి. అంతకు మించి వారికి మరేది అవసరం లేదు'' అన్నారు. 

అదేవిధంగా కార్పొరేట్ సొసైటీలో నిర్ణయాలు తీసుకునే లీడర్లు పాటించవల్సిన నియమాలను కూడా ఆయన తెలిపారు. ''ఒకటి కార్పొరేట్ లీడర్లు తీసుకునే నిర్ణయం సమాజంలో మన కంపెనీకి గౌరవాన్ని పెంచుతుందా? తగ్గిస్తుందా అని ఆలోచించుకోవాలి. రెండోది ఉద్యోగుల నుంచి నాకు మంచి గౌరవం దక్కుతుందా? అని  తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి'' అని సూచించారు. 

ఇలాంటి ప్రశ్నలు కార్పొరేట్ నిర్ణయాల్లో ప్రాథమికమైనవని, వీటితో సమాజం ఎంతో సంతోషంగా ఉంటుందని, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని మూర్తి  అభిప్రాయం.  పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయమైన విలువలను మూర్తి ఎప్పుడూ హైలెట్ చేస్తూంటారు.  

ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లికేషన్ పంపుకోవచ్చు. ఆఖరు తేదీ జూన్ 10, 2018. 

https://careers.infosys.com/CareerSite/Aspx/OffCampus.aspx?soc=tw166922


Tags: job openings at infosys

comments